నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. నీ సతి పెక్కు కల్ములిడ నేర్పరి, లోకమకల్మషంబుగా
నీ సుత సేయు పావనము నిర్మితి కార్యధురీణదక్షుఁడై
నీ సుతుఁడిచ్చు వాయువులు నిన్ను భజించిన కల్గకుండునే
దాసుల కీప్సితార్థములు దాశరథీ కరుణాపయోనిధీ!

భావం: ఓ దశరథ రామా! నీ భార్య యైన లక్ష్మీదేవి సమస్త సంపదల నీయడానికి నిపుణురాలు, నీ కూతురైన గంగ మూడు లోకాల్లో ప్రవహించి లోకాలలోని దోషాలను నిర్మూలించి పవిత్రములగా చేస్తుంది. నీ కుమారుడైన బ్రహ్మసృష్టి కార్యాలను నిర్వహించే సమర్థుడై ఆయువులను ప్రసాదిస్తాడు. ఇట్టి పుత్రీ పుత్ర కళత్రాదులు గల నిన్ను భజించిన నీ భక్తులకు కోరికల ప్రయోజనాలు నెరవేరకుండునా ? నెరవేరునని భావం.

వ్యాఖ్యానం: లక్ష్మీ అనేపదానికి సంపద, వైభవము, ధన ధాన్యములు, అదృష్టము, సౌభాగ్యం జయము, అందము, గౌరవము, సౌందర్యము అని ఇంకా చాలా అర్థాలున్నాయి.
గంగ విష్ణుపాదోద్భవా గంగా అని ఆర్యోక్తి. విష్ణుమూర్తి పాదాలల్లో ఉదభవించడం వల్ల ఆమె విష్ణుమూర్తికి కూతురు అయింది. ఈ నది మూడులోకాల్లో ప్రవహిస్తుంది. గంగాస్నానం పాపాన్ని పారద్రోలుతుంది. ఇక బ్రహ్మ సృష్టికర్త. ఆయనే ఈ సృష్టి నంతా చేస్తుంటాడు. కనుక ఈ ముగ్గురి వల్ల నీకు కీర్తి మెండుగా వస్తున్నది అని కవి చమత్కరిస్తున్నాడు.