నేర్చుకుందాం

శివనామాలు (తేటగీతి సుమాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

13. ఓం విశే్వశ్వరాయనమః
విశ్వమున ప్రత్యణువున వ్యాపించు ఘనుడు
తలచు రూపాన భువి మానవులకు చూపు
దైవమొక్కటే, భిన్న తత్వాల దాల్చు
అతడే ‘విశే్వశ్వరుండు’ నిత్యంబు గొల్తు
14. ఓం వీరభద్రాయ నమః
దక్షయజ్ఞాన సతి యోగదగ్ధమైన
భగ్నహృదయాగ్రహోదగ్ర పరమ శివుడు
ఒక్క జట తీసి వీరభద్రోగ్రమూర్తి
సృష్టి చేయగ, యజ్ఞమున్ భ్రష్టపరచె
హరుని జటరూపు‘వీరభద్రాఖ్యు’ గొలుతు
ఓం గణనాథాయ నమః
దేవదానవ మానవ జీవగణము
లన్నిటికి కర్తకర్మ క్రియలురచించి
ప్రేమ పోషించి రక్షించి పిదప లయయము
చేయు ‘గణనాథుడౌ’ సాంబశివుని తలతు

15. ఓం ప్రజాపతయే నమః
గిరులు ఝరులు తరులు వనచరులు నగర
నరులు క్రిమికీట సరులు జననమునొంద
బ్రహ్మ ను సృజించె శంకరప్రభుడు మొదట
ఆయనే‘ప్రజాపతి’ కొల్తు నహరహమ్ము

కడియాల మధుసూదన రావు 9030907191