నేర్చుకుందాం

శివనామాలు (తేటగీతి సుమాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓం పినాకినే నమః
శ్రుతిని అనుగమించెడి స్తృతి గతిని మనషి
వేద పధమున సాగిన లేదు భయము
ధనుపినాకము నిర్భయత్వమ్ము నిచ్చు
ఆ పినాకధరుని కొల్తు అహరహమును
ఓం శశిశేఖరాయ నమః
కరిగిపోయెడు వాడు దుష్కాముకుండ
మచ్చగలవాడు వంకర మనసు చంద్రు
దక్షు శాపము సవరించి రక్ష చేసె
కాన శశిశేఖరుడె నాకు కన్నతండ్రి
ఓం వామ దేవాయ నమః
ఎడమ వైపున అమ్మోరు ఇంపుగూర్ప
ఉత్తరము చూచు పంచలిగంగ్రమూర్తి
పశుపతీశుడై సద్ధర్మ పథము నడుపు
వామ దేవ మూర్తికి శత వందనములు
ఓం విరూపాక్షాయ నమ
పంచశరముల తపమును భగ్నపరుచు
మదను మదమును మంద్రించి మనుగడొసెగె
భక్తులకు కొంగు బంగారు వరదుడైన
ఆ విరూపాక్షు శుభమూర్తి కంజలిడుదు

కడియాల మధుసూదన రావు 9030907191