నేర్చుకుందాం

శివనామాలు (తేటగీతి సుమాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓం కపర్థినే నమః
దివిజ గంగ మహోత్తుంగ భువిని పడగ
ఘన జటాజూటమున నిల్చి కదల నిచ్చె
భవుని సోకిన గంగ పావనముకాదే
ఆ ‘కపర్ది’ ని దయామృతాబ్ధిగొలుతు
నీల లోహితాయ నమ
పాల సంద్రము చిల్కిన హాలహలము
అగ్గ్ధిరల లోకాల బుగ్గి చేయ
అల్లనేరేడుపండుగా అహరించు
‘నీలలోహిత’ రుద్రుడి నే దలంతు
ఓం శూల పాణినే నమః
సకల సుఖ శుభ సంప్రత్తసాదకుండు
తాను తిని దానమును చేయు త్యాగబుద్ధి
నేర్పు సద్గురు మూర్తియై నేర్పుతోడ
అతడే శంకరుండు శుభప్రదాకరుండు
ఓం శూల పాణినే నమః
కర్తయై సృష్టిచేసెడి కన్నతల్లి
కర్మయై పోషణము చేయు కరుణ తండ్రి
క్రియల సదసత్తులను విచారించు గురుడు
త్రిశర ‘శూలపాణి’ని మహాదేవు గొలుతు

కడియాల మధుసూదన రావు 9030907191