నేర్చుకుందాం

శివనామాలు (తేటగీతి సుమాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓం అంబికానాథాయ నమః
అమ్మయన అనురాగ దివ్యామృతంబు
అమ్మలనుగన్న అమ్మయే అంబికయగు
బిడ్డ ప్రగతికి ప్రాణంబు లడ్డుపెట్టు
‘అంబికానాథు’ దలదు హృదంతరమున
ఓం శ్రీకంఠాయ నమః
క్షీరసాగర మథనాన ఘోర విషము
చటుల కీలాగ్నియై ళోక సమితి గాల్చ
అల్లనేరేడుగా కంఠమందు నిలిపె
అట్లు శ్రీకంఠుడయ్యె దయామృతనిధి
ఓం భక్తవత్సలాయ నమః
అవగుణాలెన్ని ఉన్న ఒక్కావగింజ
సద్గుణంబున్న దరిజేర్చు శంభుడతడు
వత్సమును నాకు గోమాత వలెను చూచు
‘్భక్తవత్సల’ నామునే భజన జేతు
ఓం భవాయ నమః
అండపిండ బ్రహ్మాండ చరాచరములు
పుట్టునెవ్వని నుండి ఆ మూల పురుషు
ప్రత్యగాత్మను చేరునో బ్రతుకు చివర
అతడె ‘్భవుడు’దయాంబుధి కంజలిడుదు

కడియాల మధుసూదన రావు.. 9030907191