నేర్చుకుందాం

శివనామాలు (తేటగీతి సుమాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓం గంగాధరాయ నమః
అతివిశాలయై వేగంగ అభ్రగంగ
తనజటాజూటమున పట్టె ఘన కపర్ది
హరుని తాకంగ పాపసంహారిణయ్యె
అటుల ‘గంగాధరుండాయె’ అవని మురిసె
ఓం లలాటాక్షాయనమః
ఫాల మధ్యాన కన్నుతో పరమశివుడు
సహజవౌ బొట్టుగా దాల్చె ఇహపరాల
సాధనకు గోడ తవో సమిధ గాల్చె
ఇల ‘లలాటాక్షుడ’గు హరున్ గొలుతు సతము
ఓం కాలకాలాయ నమః
బాల భక్తమార్కండేయు ప్రాణము గొన
పాశమును వేయు యముని గర్వమ్ము భవుడు
వామపాదాన తాకిన వదిలిపోయె
‘కాలకాలుడు’ నామము కలిగె నపుడు
ఓం కృపానిధయే నమః
తప్పులెన్ని చేసిన కన్నతండ్రి వోలె
పాపడని పాపరాశిని పడుకొనక
తప్పు తెలుసుకొన్న క్షమించు తక్షణంబె
ఆ ‘కృపానిధి’ ప్రార్థింతు నహరమ్ము

కడియాల మధుసూదన రావు 9030907191