నేర్చుకుందాం

శివనామాలు (తేటగీతి సుమాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓం భీమాయ నమః
ఎవడు శాసనంబును సేయ ఎదురురేదొ
ఎవని గని సురుల్ భక్తి పూజించు చుంద్రు
మృత్యువైనను భృత్యుడౌ మేటి బలుడు
‘్భము’డైన దక్షారామ ధాము దలతు
ఓం పరశుహస్తాయ నమః
చేత గండ్ర గొడ్డలి ధరించిన కపాలి
నరుని కలిభవ పాశమున్ నరుకువాడు
మన పశుత్వము తెగవేసి తన లోకలుపు
‘పరశుహస్త’ శివపథము వదలనెపుడు
ఓం మృడాయ నమః
అమృతము నొసంగ గరళము నాహరించె
ధరకు గంగ దిగంగ భద్రముగ దించె
పాపుల క్షమించి తలపైన ప్రాపునిచ్చె;
శుభములే ఇచ్చు ‘మృడ’నామ సుధయె చాలు
ఓం పాశవిమోచనాయ నమః
పాశమన్నది పశువుకి బంధనమ్ము
మోహమున మనన్ బంధించు మొదటితాడు
దాని తెగగొట్టి ముక్తికి దారి చూపు
భవుడు ‘పాశవిమోచన’ పండితుండు

కడియాల మధుసూదన రావు 9030907191