నేర్చుకుందాం

శివనామాలు (తేటగీతి సుమాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓం పశుపతయే నమః
భూమిపై చరించెడి పురుగు మొదలు
నీటిలో చలించెడి చిన్న నీటి గుర్ర
మాకసమున స్వేచ్ఛగ సాగు కాకివరకు
అన్నిటికి ‘పశుపతి’ నాముడంతరాత్మ
ఓం దేవాయ నమః
చీకటన్నది గుడ్డిది, చెడుపునాది
దాని రూపమజ్ఞాన దుర్దానవతయె,
తిమిరమును చీల్చు మిహిర సందీప్తి యగుచు
‘దేవ’ యను పేరు జపియింతు భావమందు
ఓం మహాదేవాయ నమః
జ్యేష్ఠ దేవతలందున శ్రేష్ఠుడగుచు
వేషభాషల ప్రత్యేక విధులు కలిగి
అతి నిరాడంబరుండైన హరుడు గురుడు,
ఇల ‘మహాదేవ’ శుభనామము నెపుడు దలతు
ఓం అవ్యయాయ నమః
జగములోని చరాచర సంఘమునకు
సర్వసాధారణమ్మైన షడ్వికార
మార్పులేవియు లేని బ్రహ్మాండమూర్తి
‘అవ్యయుండ’ను నాముడా దివ్యమూర్తి

కడియాల మధుసూదన రావు 9030907191