నేర్చుకుందాం

శివనామాలు(తేటగీతి సుమాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓం తారకాయ నమః
గర్భవాసము నుండి భూగర్భమునకు
మధ్య మోహశోకాలలో మనిషి నలిగి
పోవువేళలో ఓంకార పుణ్యమొసగి
‘తారకుండ’యి తనలోనె దాచు భవుడు
ఓం పరమేశ్వరాయ నమః
అఖిల జగముల సృష్టించి ఆదరించి
అంతమును చేసి మోకంబు నందజేయు
దేవతా సార్వభౌముడు దీర్ఘజటుడు
సందియము లేదిక ‘పరమేశ్వరుండు’ హరుడె

ఓం అవ్యగ్రాయ నమః
కొడుకు పెడదారి పట్టిన కోపగించి
చక్కనైన దారినిపెట్టు జనకునివలె
సంస్కరణకు కోపప్రదర్శనము చేయు
భువన పితరు డవ్యగ్రునే పూజ చేతు
ఓం హరయే నమః
మానవుల పాతకముల భస్మంబు చేసి
మరొక అవకాశమిచ్చి సన్మార్గమందె
పట్టుగా సాగిన హరింతు బాధలనెడి
‘హరి’ పదాంబుజద్వయి నాకు శరణమందు

కడియాల మధుసూదన రావు.. 9030907191