నేర్చుకుందాం

శ్రీకాళహస్తీశ్వరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వామిద్రోహము చేసి వేరొకనిఁ కొల్వన్ బోతినో? కాక నే
నీ మాట ల్విననొల్ల కుండితినో? నినే్న దిక్కుగాఁ జూడనో?
యేమీ, యిట్టి వృధాపరాధినగు న న్నీ దుఃఖవారాశి వీ
చీ మధ్యంబున ముంచి యుంపదగునా? శ్రీకాళహస్తీశ్వరా

అర్థం: ఈశ్వరా! నిన్ను కాదని స్వామిద్రోహము చేసి, మరొక దేవుని సేవించినా? పోనీ, నీవు చెప్పిన వేదవాక్యములపై నమ్మకము లేక నిరాదరణ చేసి, నాస్తికుడనైతినా? నినే్న దిక్కుగా భావించలేదా? ఏ తప్పూ చేయని నన్ను, ఈ సంసార దుఃఖ సముద్రంలో ముంచి, చూసి వినోదించటం నీకు న్యాయమా? నన్ను ఉద్ధరించటం నీ కర్తవ్యం కాదా? (పరమేశ్వరుని ముఖము నుండి వేదాలు పుట్టినవని ప్రసిద్ధి. వారిని నమ్మినవారిని నాస్తికులంటారు)