నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ . ఆది నారాయణా! యనుచు నాలుక తోడ
లుక నేర్చిన వారి ప ఆదములకు
సాష్టాంగముగ నమస్కారమర్పణ జేసి
ప్రస్తుతించెదనయ్య బహువిధముల
ధరణిలో నరులెంత దండి వారైనను
నిన్నుఁ గానని వారి నే స్మరింప
మేము శ్రేష్ఠులమంచు మిడుకు చుండెడివారి
చెంతఁ జేరగఁ బోను శేషశయన
తే. పరమసాత్త్వికులైన నీ భక్తవరుల
దాసులకు దాసుడను సుమీ! ధరణిలోన
భూషణ వికాస ! శ్రీధర్మపురి నివాస
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

భావం: స్వామీ నరసింహా! నీవే ఈ విశ్వసృష్టికి మూల పురుషుడవని స్తుతించే వారి పాదపద్మాలకు నేను సాగిల పడి మ్రొక్కుతారు. కాని భూప్రపంచంలో మానవులెంత దొడ్డవారైనా నిన్ను కనలేని వారైతే వారిని నేను పల్కరించను. అంతేగాదు నీ కంటే మేమే శ్రేష్టులమని విఱ్ఱవీగే వారిచెంత చేరను.. ఓ శేషశాయా! ప్రపంచంలో సత్త్వగుణం కల్గింప నీ భక్తులెల్లరికి దాసానుదాసుడుగా ఉంటాను.