నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ॥ అవనిలోఁగల యాత్ర -లన్ని చేయఁగ వచ్చు
ముఖ్యవౌ నదులందు మునుఁగవచ్చు
ముక్కుపట్టుక సంధ్య మొనసి వార్చఁగ వచ్చుఁ
దిన్నఁగా జపమాలఁ ద్రిప్ప వచ్చు
వేదాల కర్థంబు విఱిచి చెప్పఁగవచ్చు
శ్రేష్ఠ క్రతువులెల్ల ఁ జేయవచ్చు
దనములక్షలు కోట్లు దానమీయఁగ వచ్చు
నైష్ఠికాచారముల్ నడుప వచ్చుఁ
తే॥ జిత్త మస్యస్థలంబుల ఁ జేరకుండ
నీ పదాంభోజముల యందు నిలుప ఁ గలమె
భూషణ వికాస - శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార నరసింహ దురిత దూర

భావం: ఓ స్వామీ! ప్రపంచంలో యాత్రలెన్ని ఐనా చేయవచ్చు. ప్రసిద్ధ నదుల్లో తీర్థమాడవచ్చు. ముక్కు పట్టుకుని సంధ్యవార్చవచ్చు. తిన్నగా జపమాల తిప్పవచ్చు. వేదాలకర్థం విడదీసి చెప్పవచ్చు. మంచియగాలు చేయవచ్చు. నిష్ఠగా ఆచారాలు నిర్వహింపవచ్చు. కాని మనస్సును ఇతర చింతల నుండి మరల్చి ఉంచటం సాధ్యమవుతుందా? అంటే కష్టసాధ్యమైన పని కదా అది.