నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. భువన రక్షక! నిన్ను ఁ బొగడ నేరని నోరు
ప్రజ కగోచరమైన- పాడుబొంద
సురవరార్చిత! నిన్నుఁ జూడఁ గోరనికనుల్
జలములోపల వెల్లి - సరపు గుండ్లు
శ్రీరమాధిప! నీకు సేవఁ జేయని మేను
కూలి కమ్ముడువోని కొలిమితిత్తి
వేడ్కతో నీ కథల్ వినని కర్ణంబులు
కఠిన శిలాదులఁ గలుగు దొఱలు
తే. పద్మలోచన! నీమీద భక్తి లేని
మానవుఁడు రెండు పాదాల మహిషమయ్య
భూషణ వికాస ! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: ఓ నరసింహా ప్రభూ! నీ స్తుతి చేయని నోరు పాడుగొయ్యి. నిన్ను చూడని కండ్లు నీటిలోని మొగ్గలు, నీ సేవ చేయని శరీరం పనికిరాని కొలిమితిత్తి. ఇనీ కథలు వినని చెవులు రాతితొఱ్ఱలు, నీ పై భక్తి లేని మానవులు రెండు గాళ్ల పశువే.