నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ అతివిద్య నేర్చుట - యన్న వస్తమ్రులకె
పశులనార్జించుట పాలకొఱకె
సతిని బెండ్లాడుట సంసార సుఖముకే
సుతులఁబోషించుట గతుల కొఱెకె
సైన్యముల్ గూర్చుట శత్రు భయంబుకే
దానమిచ్చుటలు ముందటి సంచితమునకె
ఘనముగాఁ జదువుటల్ కడుపుకొఱకె
తే ఇతరకామంబుఁ గోరక సతతముగను
భక్తినీయందు నిల్పుట ముక్తికొఱకె
భూషణవికాస! శ్రీ్ధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
*
భావం: నరసింహప్రభూ! తిండి గుడ్డలకోసమే ఎక్కువ చదువులు. పాలకోసమే పసుల్ని సంపాదించటం. సంసార సుఖం కోసమే పెళ్లాడటం. పుణ్యలోక ప్రాప్తికోసమే బిడ్డల్ని కనటం. శత్రు భయంతోనే సైన్య సమీకరణం. చావుకోసమే సాము గరిడీలు నేర్వడం. జన్మాంతర సుఖం కోసమే దానం చేయటం. కోటి విద్యలు కూటికోసమే. అన్ని కోర్కెలు మానుకొని నీయందే భక్తిని నిల్పటమంటే మోక్షం కోసమే గదా!