నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ ధరణిలో వేయేండ్లు తనువు నిల్వఁగఁబోదు
ధనమెన్నటికి శాశ్వతంబుగాదు
దారసుతాదులా తనవెంట రాలేరు
భృత్యులు మృతిని తప్పింపలేరు
బల పరాక్రమమేమి పనికిరాదు
ఘనమైన సకల భాగ్యములెంతఁ గల్గియు
గోచి మాత్రంబైనఁ గొనుచుఁబోఁడు,
తే వెఱ్ఱి కుక్కల భ్రమలన్ని విడిచి నిన్ను
భజన చేసెడివారికిఁ బరమసుఖము
భూషణ వికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దరితదూర!

భావం:ఓ స్వామీ! ఈ మేను ప్రపంచంలో వేయేండ్లు మనదు. గడించిన డబ్బు శాశ్వతంగాదు. పెళ్లాం పిల్లలెవ్వరు చనిపోయే నాడు వెంట రారు. సేవకులు చావునుండి మనల్ని కాపాడలేరు. చుట్టాలు బతికించలేరు. బల పరాక్రమాలేవి పనిచేయవు. ఎంత సిరిసంపదలార్జించినా అందులోనుంచి గోచిపాతంత కూడ వెంటదీసుకొని పోలేము. వెఱ్ఱికుక్కల్లాగ భ్రాంతికి లోబడకుండా నిన్ను సేవించేవారికే ఎంతో సుఖం కల్గుతుంది.