నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ నరసింహ! నాకు దుర్ణయములే మెండాయె
సుగుణమొక్కటి లేదు చూడఁ జనిన
అన్యకాంతలమీఁద నాశమానఁగలేను
బరుల క్షేమముఁజూచి బ్రతుకలేను
ఇటువంటి దుర్బుద్దు లిన్ని నాకున్నవి
నేనుఁ జేసెడి వన్ని- నీచకృతులు
నావంటి పాపిష్ఠి నరుని భూలోకాన
బుట్టఁజేసితివేల భోగిశయన!
తే అబ్జదళనేత్ర! నా తండ్రివైనఫలము
నేరములు గాచి రక్షింప వీవెదిక్కు
భూషణవికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: నరసింహప్రభూ! నాకు గలవన్నీ చెడ్డ ఆలోచనలే. నేను మంచివాణ్ణిగాను. ఇప్పటికీ పరస్ర్తిల మోజు తగ్గలేదు. ఇతరుల సుఖాన్ని చూచి ఓర్వలేను. అన్ని ఇన్ని అని చెప్పలేనన్ని చెడ్డ ఆలోచనలే నావి. నేను చేసేవన్ని చెడ్డపనులే. నా వంటి అధముణ్ణి లోకంలో ఎందుకు పుట్టించావు? నాకు నీవు తండ్రివైనందువల్ల నా తప్పులన్నింటిని మన్నించి నన్ను రక్షింపుము.