నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ ధీరతఁ బరుల నిందింపనేర్చితిఁగాని
తిన్నగా నినుఁ బ్రస్తుతింపనైతి
పొరుగు కామినులందు బుద్ధి నిల్పితిఁగాని
నిన్నునే సతము ధ్యానింపనైతి
పొరికి ముచ్చటలైన మురిసివింటిని గాని
యెంచి నీకథలాల- కించనైతి
కౌతుకంబునఁ బాతకము గడించితిఁగాని
హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతి
తే అవనిలో నేను జన్మించి నందుకేమి
సార్థకము గానరాదాయె స్వల్పమైన
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: ఓ నరసింహ ప్రభూ! ధైర్యంగా ఇతరుల్ని తిట్టం నేర్చానేగాని నిన్ను పొగడుతూ ధ్యానించలేకున్నాను. అన్యకాంతలపై ఆసక్తి పెంచుకున్నానేగాని, ఎల్లప్పుడు నిన్ను స్మరించలేకపోయాను. కల్లబొల్లి కబుర్లపై మక్కువ పెంచుకున్నానేగాని, నీ కథల్ని చెవులార వినకపోయాను. ఎంతో ఉత్సాహంతో పాపాలు చేశానేగాని పుణ్యమార్జించలేకపోయాను. అందుకే ఈ లోకంలో పుట్టినందుకు నా జీవితానికి ఎలాంటి సార్థకత లేకుండాపోయింది.