నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ అంత్యకాలమునందు నాయాసమున నిన్నుఁ
దలఁతునో తలఁపనో - తలఁతునిపుడె!
నరసింహ! నరసింహ! నరసింహ! లక్ష్మీశ!
దానవాంతక! కోటిభానుతేజ!
గోవింద! గోవింద! గోవింద! సర్వేశ!
పన్నగాధిపశాయి! పద్మనాభ!
మధువైరి! మధువైరి! మధువైరి! లోకేశ!
నీలమేఘశరీర! నిగమవినుత!
తే ఈ విధంబుగ నీ నామమిష్టముగను
భజన చేయుచునుందును నా భావమందు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: ఓ నరసింహస్వామీ! ప్రాణం పోయే చివరి క్షణంలో నిన్ను స్మరిస్తానో లేదో తెలీదు. అందువల్ల నరసింహ, లక్ష్మీశ, దానవాంతక, కోటిసూర్యతేజ, గోవింద, సర్వేశ, శేషశాయి, పద్మనాభ, మధువైరి, లోకేశ, నీలమేఘశ్యామ, వేదవినుత అని నిన్ను ఇష్టనామాలతో పిలుస్తూ స్మరిస్తాను.