నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ కాయమెంత భయానఁ గాపాడినను గాని
ధాత్రిలోనది చూడఁదక్కఁబోదు
నీ వేళ నే రోగ మేమరించునొ సత్త్వ
మొందంగఁజేయ నేచందమునను
ఔషధంబులు మంచి ననుభవించినఁగాని
కర్మక్షీణంబైనఁ గాకవిడదు.
కోటివైద్యులు గుంపుగూడి వచ్చినఁగాని
మరణమయ్యెడి వ్యాధి మాన్పలేరు.
*
తే జీవుని ప్రయాణకాలంబు సిద్ధమైన
నిలుచునా దేహమిందొక్క నిముషమైన
భూషణవికాస! శ్రీ ధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
*
భావం: ఓ ప్రభూ! ఈ శరీరాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడినా ఇది స్థిరంగా నిలువదు. ఎప్పుడేరోగం వచ్చి మోసగిస్తుందో? ఎనె్నన్ని మందులు తిన్నా కర్మ తొలగకుండ రోగం నయం కాదు. కోటి వైద్యులు కూడ మరణాంతకమైన వ్యాధిని మాన్చలేరు. ప్రాణం పోయే కాలంలో ఏమి చేసినా బొందిలో అది నిలువదు. ఒక్క క్షణమైనా శరీరం ఆగదు.