నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ నరసింహ! నిన్నునే నమ్మినందుకు చాల
నెనరు నాయందుంచు నెమ్మనమున
నన్ని వస్తువులు నిన్నడిగి వేసట పుట్టె
నిఁకనైన ననుఁ గటాక్షింపవయ్య
సంతసంబున నన్ను స్వర్గమందే యుంచు
భూమియందే యుంచు భోగిశయన!
నయముగా వైకుంఠ నగరమందే యుంచు
నరకమందే యుంచు నళిననాభ!
తే ఎచట నన్నుంచినను గాని యెపుడు నిన్ను
మఱచిపోకుండ నీ నామస్మరణ నొసఁగు
భూషణ వికాస! శ్రీ ధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: నరసింహస్వామీ! నిన్ను నేను నమ్మినాను. నాపై దయయుంచు. ఇంతదాకా పదార్థాలకై నిన్ను వేడివేడి విసుగుపుట్టింది. ఇకనైనా నన్ననుగ్రహించు. నన్ను స్వర్గములో నుంచినా, భూమిలోనే ఉంచినా విచారమేమిలేదు. వైకుంఠంలో గాని నరకంలోగాని ఉంచు. ఎక్కడ ఉంచినా ఫరవాలేదు. కాని నీ నామ జపాన్ని మరచిపోకుండా ప్రసాదించు.