నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ దేహమున్నవఱకు మోహసాగరమందు
మునుఁగుచుందురు శుద్ధ మూఢజనులు
సలలితైశ్వరముల్ - శాశ్వతంబనుకొని
షడ్భ్రమలను మానఁజాలరెవరు
సర్వకాలము మాయ సంసారబద్ధులై
గురుని కారుణ్యంబు గోరుకొనరు
జ్ఞానభక్తి విరక్తులైన పెద్దలఁజూచి
నిందఁజేయక తాము నిలువలేరు
తే మత్తులైనట్టి దుర్జాతిమనుజులెల్ల
నిన్నుఁగనలేరు మొదటికే నీరజాక్ష!
భూషణ వికాస! శ్రీ్ధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర

భావం: ఓ స్వామీ! బొందిలో ప్రాణమున్నంతకాలం వ్యామోహాలకు గురియై, సంపదలే శాశ్వతమనుకొని, అరిషడ్వర్గాదులకు దాసులై జ్ఞానార్జనకై గురువుని ఆశ్రయించరు. భక్తి జ్ఞాన వైరాగ్యాలుగల సాధువుల్ని చూస్తే తిట్టకుండ ఉండలేరు. ఈ దుష్టులకు నీ సంగతి ఏ మాత్రం తెలియదు.