నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ ఇలలోననే జన్మమెత్తినప్పటినుండి
పలుగడించితి నయ్య పాతకములు
తెలిసిచేసితిఁ గొన్ని తెలియఁజాలక చేసి
బాధ నొందితినయ్య పద్మనాభ!
అనుభవించెడు నప్పుడుతిప్రయాసంబంచుఁ
బ్రజలు చెప్పఁగఁ జాల భయము గలిగె
ఎగిరిపోవుటకునై ఏయుపాయంబైనఁ
జేసి చూతమటన్నఁ జేత కాదు
తే సూర్యశశినేత్ర! నీచాటుఁ జొచ్చినాడఁ
గలుషములు ద్రుంచి ననే్నలు కష్టమనక
భూషణవికాస! శ్రీ్ధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దూరితదూ!

భావం: స్వామీ! పుట్టిన తర్వాత ఎన్నో పాపాలు చేశాను. కొన్ని తెలిసి చేసి, కొన్నింటిని తెలియక చేసి చాలా బాధపడ్డాను. వీటి ఫలితాన్ని అనుభవించడం చాలా ప్రయాసతో కూడిందని ప్రజలు చెప్పితే విని భయపడ్డాను. తప్పించుకొని పారిపోదామంటే నాకు చేత కాలేదు. ప్రభూ! నీ ఆశ్రయం కోరాను. నన్ను దగ్గరదీసి కాపాడు. కష్టమనుకోకు.