నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ తాపసార్చిత! నేను పాపకర్ముఁడనంచు
నాకు వంకలు పెట్టఁబోకు సుమ్మి
నాటికి శిక్షలు నన్నుఁజేయుటకంటె
నేడు సేయము నీవు నేస్తమనక
అతిభయంకరులైన యమదూతలకు నన్ను
నొప్పగింపకుమయ్య యురగశయన!
నీ దాసులను బట్టి నీవు దండింపంగ
వద్దు వద్దెనరెంత పెద్దలైన
తే తండ్రివై నీవు పరపీడఁ దగులఁజేయ
వాసిగల పేరుకపకీర్తి వచ్చునయ్య!
భూషణ వికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
*
భావం: మునిజన వందితుడవైన ఓ నరసింహ ప్రభూ! నేను పాపాలు చేసేవాణ్ణని ముద్రవేయవద్దు. నన్ను శిక్షించాలని వుంటే, మరణ సమయంలో ఎందుకు? ఇప్పుడే శిక్షించు. యమదూతలు చాలా కఠినాత్ములు. వారికి నన్నప్పగించకు. నీ భక్తుల్ని నీవు శిక్షిస్తే ఎంతవారైనా అడ్డుపెట్టరు. నీవు తండ్రివంటివాడవు. నీవు ఇతరుల్ని పీడిస్తే నీ కీర్తికే మచ్చ.