నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ ధరణిలోపల నేను తల్లి గర్భమునందుఁ
బుట్టినప్పటినుండి పుణ్యమెరుఁగ
ఏకాదశీ వ్రతంబెన్నడుండఁగ లేదు
తీర్థయాత్రలకైనఁ దిరుగలేదు
పారమార్థికమైన పనులు సేయఁగ లేదు
భిక్షమొక్కనికైనఁ బెట్టలేదు
జ్ఞానవలంతులకైనఁబూని మ్రొక్కఁగలేదు
ఇతర దానములైన నియ్యలేదు
తే నళినదళనేత్ర! నిన్నునే నమ్మినాను
జేరి రక్షింపవే నన్ను శీఘ్రముగను
భూషణవికాస! శ్రీ్ధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: ఓ నరసింహస్వామి! ఈ ప్రపంచంలో తల్లి గర్భం నుండి పుట్టిన తర్వాత పుణ్యమంటే ఏమిటో తెలియనివాణ్ని. ఏకాదశినాడు ఉపవాసవ్రతం ఆచరించలేదు. తీర్థయాత్రలకు కూడ తిరుగలేదు. దైవికమైన పూజా పురస్కారాలు చేయలేదు. పిడికెడు ముష్టి ఎవ్వరికి వేయలేదు. జ్ఞానులకైనా కనీసం మ్రొక్కలేదు. ఎలాటి దానాలు చేయలేదు. నిన్ను మాత్రమే నమ్ముకున్నాను. నన్ను త్వరగా రక్షింపుము.