నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ కువలయశ్యామ! నీ కొలువుచేసిన నాకు
జీతమెందుకు ముట్టఁ జెప్పవైతి
మంచి మాటలచేత కొంచెమియ్యఁగ లేవు
కలహవౌనికఁ జుమ్ము ఖండితముగ
నీవు సాధువుగాన నింతపర్యంతంబు
జనువుచే నిన్నాళ్ళు జరుపవలసె
నిఁక నే సహింపనీ విపుడు ననే్నమైన
శిక్షఁ జేసిన చేయు సిద్ధ మైత్రి
తే నేడు కరుణింపకుంటివా నిశ్చయముగఁ
దెగఁబడెదఁ జూడు నీతోడ జగడమునకు
భూషణవికాస! శ్రీ్ధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: ఓ నల్లనయ్యా! నీ సేవ చేశాను గదా! నాకెందుకు జీతమియ్యవు? మంచిగా అడిగితే ఇచ్చేవాడివిగాదు- తగవులాడవలసి వస్తుంది సుమా! నీవు సాధుశీలుడవని ఇన్నాళ్ళు చనువుతో ఊరకున్నాను, ఇక తాళలేను. నన్ను నీవు హింసించినాసరే కరుణించకపోయావో ఇక నీతో జగడానికి సిద్ధం చూడు.