నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. బలురోగములకు నీ పాదతీర్థమె కాని
వలదు మందులు నాకు వలదు వలదు
చెలిమి చేయుచు నీకు సేవఁ జేసెదఁ గాని
నీ దాసకోటిలో నిలుపవయ్య
గ్రహభయంబునకుఁ జక్రముఁ దలంచెదఁ గాని
ఘోరరక్షలు కట్ట ఁ గోరనయ్య
పాముకాటుకు నిన్ను భజనఁ జేసెదఁ గాని
దాని మంత్రము నేను దలపనయ్య
తే. దొరికితివి నాకుఁ దండ్రివైద్యుఁడవు నీవు
వేయి కష్టాలు వచ్చిన వెఱవనయ్య!
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: ఓ నరసింహస్వామీ! ఎంత పెద్ద రోగం వచ్చినా నీ పాదజలం తీసుకొంటాను గాని మందులు ఆశించను. స్నేహభావంతోనీకు సేవ చేస్తాను. నీ భక్తుల్లో నన్ను కలుపుకో. గ్రహపీడలు గల్గితే నీ సుదర్శన చక్రాన్ని స్మరిస్తాను గాని తాయెతుల జోలికి పోను. పాము కరిస్తే నిన్ను భజిస్తానే కాని మంత్రాల్ని చదువను. నీవే తండ్రివి. నీవే వైద్యునివి.