నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. కూటికోసము నేఁను గొఱగాని జనులచే
బలు గద్దరింపులు పడఁగ వలసె
దారసుత భ్రమ దగిలి యుండుటఁగదా
దేశదేశములెల్లఁ దిరుగ వలసె
పెను దరిద్రతపైనఁ బెనఁగి యుండుట ఁగదా
చేరి నీచుల సేవఁ జేయవలసె
నభిమానములు మది నంటి యుండుటఁ గదా
పరులఁజూచిన భీతి పడఁగ వలసె
తే. నిటుల సంసార వారాశి నీడలేక
వేయివిధముల నిన్ను నే వేడుకొంటి
భూషణ వికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: నేను కూటకోసం కొఱమాలిన జనం చేత మాటలు పడవలసి వచ్చింది. ఆలుపిల్లలనే భ్రాంతిచే ఊరూరు తిరుగవలసి వచ్చింది. పేదరికం వల్ల నీచుల్ని ఆశ్రయించి ఊడిగం చేయవలసి వచ్చింది. అభిమానం వల్ల ఇతరుల్ని చూచి భయపడవలసి వచ్చింది. తండ్రీ! సంసార సముద్రాన్ని తరించలేక నిన్ను వేడుకొంటున్నాను. నన్ను రక్షించు స్వామీ!