నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. సాధు సజ్జనులతో జగడ మాటనఁగీడు
కవులతో వైరంబుఁ గాంచఁ గీడు
పరమ దీనులఁ జిక్కఁబట్టి కొట్టిన ఁ గీడు
భిక్షుకులమ దుఃఖపెట్టఁ గీడు
నిరుపేదలను జూచి నిందఁ జేసినఁ గీడ
పుణ్యవంతుల ఁదిటఁ బొసగుఁ గీడు
సద్భక్తులను దిరస్కార మాటినఁగీడు
గురుని ద్రవ్యము దోచుకొనినఁ గీడు
తే. దుష్టకార్యము లొనరించు దుర్జనులకు
ఘనతరంబైన నరకంబు గట్టు ముల్లె
భూషణ వికాస! శ్రీధర్మపురినివాస!
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

భావం: ఓ తండ్రీ! మంచివారితో దెబ్బలాటినా,కవులతో విరోధం పెట్టుకున్నా, దీనుల్ని కొట్టినా, యాచకుల్ని ఏడ్పించినా, నిరుపేదల్ని నిందించినా పుణ్యాత్ములైన భక్తుల్ని తూలనాడినా, గురువుల సొమ్ము అపహరించినా, కీడు తప్పదు. చెడ్డపనులు చేసే దుష్టులకు న రకమే గట్టి ముల్లె.