నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. పరుల ద్రవ్యము మీఁద భ్రాంతినొందిన వాఁడు
పరకాంతల కపేక్ష పడెడివాఁడు
ఆర్యుల చిత్తంబు లపహరించెడి వాఁడు
దాన మియ్యంగ వద్దనెడివాఁడు
సభలలోపల నిల్చి చాడి చెప్పెడివాఁడు
పక్షపు సాక్ష్యంబు పలుకు వాఁడు
విష్ణుదాసులఁ జూచి వెక్కిరించెడివాఁడు
ధర్మసాధులఁ దిట్టఁ దలఁచు వాఁడు
తే. ప్రజల జంతుల హింసించు పాతకుండు
కాలకింకర గదలచే ఁ గష్టమొంచు
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
*
భావం: నరసింహాస్వామీ! ఇతరుల సొమ్ము నాశించువాడు, పరస్ర్తిలకు కోరేవాడు బిచ్చగాండ్ర సొమ్ము నపహరించేవాడు, ఎవరైనా దానమిస్తూ ఉంటే వద్దని వారించేవాడు, సభల్లో చాడీలు చెప్పేవాడు, పక్షపాత బుద్ధితో ఏకపక్షంగా సాక్ష్యం చెప్పేవాడు, విష్ణ్భుక్తుల్ని ఎగతాళి చేసేవాడు, మంచివారిని తిట్టేవాడు, ప్రజల్ని జంతుజాలాన్ని హింసించేవాడు యమకింకరులచే హింసించబడుతాడు.