నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. నరసింహ నా తండ్రి ననే్నలు ననే్నలు
కామితార్థములిచ్చు కావు కావు
దైత్య సంహార! చాలదయయుంచు దయయుంచు
దీన పోషక! నీవె దిక్కు దిక్కు
రత్న భూషిత పక్ష! రక్షింపు రక్షింపు
భునవ రక్షక! నన్ను బ్రోవు బ్రోవు
మారకోటి స్వరూప! మన్నించు మన్నించు
పద్మలోచన ! చేయి పట్టు పట్టు
తే. సుర వినుత! నేను నీచాటు జొచ్చినాను
నా మొఱాలించి కడదేర్చు నాగ శయన!
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాసై
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!
భావం: నరసింహస్వామీ! నీవు నాకు జన్మనిచ్చిన తండ్రివి. నేను గోరిన సంపదలిచ్చి నన్ను కాపాడుము. నాపై కరుణ చూపుము,. దీన వత్సలుడవైన నీవే నాకు దిక్కు. నీది రత్న భూషిత వక్షఃస్థలం. నీవే నన్ను రక్షించాలి. లోకాలన్నింటిని కాపాడేవాడవు నీవే. నన్ను నీ దగ్గర చేర్చుకో. కోటి మన్మథులంత అందగాడివి నీవు. నన్ను అనుగ్రహించు తండ్రీ! నా మొర ఆలకించి నన్ను కాపాడుము.