నేర్చుకుందాం

విజేత -

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. అరయ మానవ సేవయే ధరణిలోన
మాధవునకుఁ జేసెడి సేవ మరువఁబోకు
సత్యవాక్కుకుఁ బ్రాణమ్ము ఁ జక్కగాను
నిత్యముం బోయు వాడెపో నిజ విజేత!

తే.గ. ధర్మకంకణ బద్ధుడై దైవ చింత
నామృతంబును గ్రోలుచు హాయినొంది
సత్ప్రవర్తన తో నిల సాగువాడు
న్యాయ బుద్ధితో నిత్యమ్ము నడచువాడు
నిక్కముంబల్క వాడెపోనిజ విజేత!

తే.గీ, మంచియున్నది పదిపాళ్లుఁ బెంచువాడు
మదిన కల్మషమే లేక మసలువాడు
స్ర్తిలనెంతయో గౌరవించెడి యతండు
నిక్కముం బల్కవాడెపో నిజ విజేత!

కొడుకుల సూర్య సుబ్రహ్మణ్యం - 9492457262