నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. సర్వేశ! నీ పాద సరసిజద్వయమందుఁ
జిత్తముంపఁగలేను జెదరకుండ
నీవైన దయయుంచి నిలిచి యుండెడి యట్లు
చేసినన్నిపు డేలు సేవకుఁడను
వనజలోచన! నేను వట్టి మూర్ఖుఁడఁజుమ్మి
నీ స్వరూపముఁ జూడ నేర్పు వేగ
తన కుమారుల కుగ్గు తల్ల పోసినయట్లు
భక్తి మార్గంబను పాలుపోసి
తే. ప్రేమతో నన్ను ఁబోషించి పెంచుకొనుము
ఘనత కెక్కించు నీ దాసగుణములన
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: ఓ నరసింహప్రభూ! అంతటికీ నీవే అధికారివి. నీ పాదపద్మాల పైన నామనస్సుని కదలకుండ ఉంచలేకున్నాను. మనసుని కుదరుగా నిలిచేటట్టు నీ దాసుడనైన నన్ను కాపాడు. కమలనయనా! నీ ఆకృతిని చూడని మూర్ఖుణ్ణి, తల్లి పాలిచ్చి బిడ్డని పోషించేవిధంగా భక్తి మార్గమనే పాలు పోసి నీవు ప్రేమతో పోషించు నీ భృత్యగణముతో నా పేరు నిల్పుము తండ్రీ!