నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. జీమూత వర్ణ! నీ మోముతో సరి రాక
కమలారియతి కళంకునఁ బడియె
సొగసైన నీ నేత్ర యుగముతో సరిరాక
నళిన బృందము నీళ్ల నడుమఁ జేరె
కవి రాజ వరద! నీ గళముతో సరిరాక
పెద్ద శంఖము బొబ్బ పెట్టఁ దొడఁగె
శ్రీపతీ! నీ దివ్యరూపుతో సరిరాక
పుష్పబాణుఁడు నీకుఁ బుత్రుఁ డయ్యె
తే. ఇందిరాదేవి! నిన్ను మోహించి విడక
నీకుఁ బట్ట మహిషి యయ్యె నిశ్చయముగ
భూషణ వికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: ఓ స్వామీ! నీది మబ్బురంగు. నీ ముఖసౌందర్యంతో చంద్రుడు మచ్చగల వాడైనాడు. అందమైన నీ కళ్లతో సరితూగజాలక తామరలు నీటి మధ్య దాగాయి. గజేంద్రుని కాపాడిన నీ గొంతుకతో సరిరాక శంఖము పెడబొబ్బ పెడుతోంది. లక్ష్మీనాథుడైన నీ తో పోల జాలక మన్మథుడు నీ కొడుకయ్యాడు. లక్ష్మీదేవి నిన్ను ప్రేమించి నీ పట్టపురాణి అయింది. ఇది నిజం.