నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. హరిదాసులను వాదులాడకుండినఁ జాలు
సకల గ్రంథంబులు చదివినట్లు
భిక్షమియ్యంగ ఁ దప్పింపకుండినఁ జాలు
చేముట్టి దానంబు చేసినట్లు
మించి సజ్జనుల వంచించకుండిన ఁ జాలు
నింపుగా బహుమానమిచ్చినట్లు
దేవాగ్రహారముల్ దీయకుండిన ఁ జాలు
గనకకంబపుగుళ్ళు గట్టినట్లు
తే. ఒకని వర్షాశనము దీయకున్నఁ జాలుఁ
బేరుకీర్తిగ సత్రముల్ పెట్టినట్లు
భూషణ వికాస! శ్రీ్ధర్మపురనివాస
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

భావం: ఓ నరసింహస్వామీ విష్ణ్భుక్తుల్ని నిందించకుండా ఉంటే అది సకల శాస్త్రాలు చదివినంత గొప్ప. దాన ధర్మాలు మాన్పించకపోతే చాలు తాను చేజేతులా దానం జేసినట్లే. మంచివారిని మోసగించకుంటే చాలు మంచి బహుమానాలిచ్చినంత మేలు. దేవాలయ మాన్యాల్ని తీసివేయుంటే చాలు బంగారు దేవాలయాలను నిర్మించినంత పుణ్యం. ఒకరి వార్షికాన్ని పాడుచేయకపోతే చాలు గొప్పగా సత్రాల్ని నిర్మించినంత మంచిది