నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. వదనంబు నీ నామ భజన గోరుచునుండు
జిహ్వ నీ కీర్తనల్ సేయగోరు
హస్తయుగ్మము నిన్ను నర్చింప గోరును
కర్ణముల్ నీ మీద కథలు గోరు
తనువు నీ సేవయే ఘనముగా గోరును
నయనముల్ నీ దర్శనంబు గోరు
మూర్ధమ్ము నీ పాదముల మ్రొక్కగా గోరు
ఆత్మ నీదై యుండు నరసి చూడ
తే. స్వప్నముల నైన నేవేళ సంతతమును
బుద్ధి నీ పాదములయందు బూని యుండు
భూషణ వికాస ! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

భావం: ఓ నరసింహ స్వామీ! నా మొము నీ భజనని, నా నాల్క నీ కీర్తిని, నా చేతులు నీ పూజని, నా చెవులు నీ కథల్ని నా దేహం నీ సేవల్ని , నా కళ్లు నీ దర్శనాన్ని , నా శిరస్సు నీ పాదాభివందనాన్ని , నా ఆత్మ నీ ఆధీనాన్ని ఆశిస్తుంటాయి. కలలోనైనా మెలకువలోనైనా అన్ని వేళల్లో నా మస్సు నీ పాద ధ్యానంలోనే లగ్నమై ఉంటుంది.