నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. పలుమాఱు దశరూపములు ధరించితివేల?
నేక రూపముఁబొందనేల నీవు?
నయమున క్షీరాబ్దినడుమఁ జేరితివేల?
రత్నకాంచనమందిరములు లేవె?
పన్నగేంద్రుని మీఁద ఁ బవ్వళించితివేల?
జలతారు పట్టెమంచములు లేవె?
రెక్కలు గల పక్షి నెక్కి సాగితివేల?
గజతురంగాందోళికములు లేవె?
తే. వనజరోచన! ఇటువంటి వైభవములు
సొగసుగా నీకుఁ దోచెనో సుందరాంగ
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: ఓ నరసింహస్వామీ! పది అవతారాలెత్తడమెందుకు? ఒక్కరూపం చాలదా? పాలసముద్రం మధ్యకేల పోయావు? రతనాలు పొదిగిన బంగారు భవనాలు లేవా? పాముపై పవ్వళించావు - జలతారు పట్టె మంచాలు లేవా? పక్షినెక్కావు ఏన్గులు, గుఱ్ఱాలు , పల్లకీలు లేవా ఊరేగడానికి ఓ పద్మనేత్రా! ఓ అందగాడా! ఈ సంపదలు నీకు సొగసనిపించాయా?