నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. తార్‌క్ష్యవాహన! నీవుదండిదాతవటంచుఁ
గోరి వేడుక నిన్నుఁ గొల్వవచ్చి
యర్ధిమార్గమును నే ననుసరించితినయ్య
లావైన పదునాల్గు లక్షలైన
వేషముల్ చేసి నా విద్యా ప్రగల్భత
జూప సాగితి నీకు సుందరాంగ!
ఆనందమైన నే నడుగ వచ్చిన దిచ్చి
వాంఛ ఁదీర్చుము నీలవర్ణ! వేగ
తే. నీకు నా విద్య హర్షగాకయున్న
తేప తేప వేషముల్ దేను జుమ్మి!
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట విహార! నరసింహ! దురిత దూర!
భావం: ఓ స్వామీ! నీవు గరుడ వాహనుడవు. మరియు గొప్పదాతవని నమ్మి నిన్ను యాచక పద్ధతిలో సేవింప వచ్చాను. నేను నైపుణ్యంతో పెక్కు వేషాలు ప్రదర్శిస్తున్నాను. ఇవి సంతోషాన్ని గల్గిస్తే నేను కోరిన కోర్కెల్ని నెరవేర్చు - నేనడిగింది ఇవ్వు. నా విద్య నచ్చక పోతే ఇంక మాటిమాటికి ఈ వేషాలు కట్టను.