నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. భువనేశ! గోవింద! రవికోటి సంకాశ!
పక్షివాహన ! భక్త పారిజాత!
అంభోజ భవ రుద్ర జంభారి సన్నుత
సామ గాన విలోల! సారసాక్ష!
వనధి గంభీర ! శ్రీ వత్స కౌత్సుభవక్ష!
శంఖ చక్ర గదాసి శార్‌ఙ్గ హస్త!
దీన రక్షక! వాసుదేవ! దైత్య వినాశ
నారదార్చిత దివ్య నాగ శయన

తే. చారునవరత్న కుండల శ్రవణయుగల
విబుధ వందిత పాదాబ్జ విశ్వరూప
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్ట సంహార ! నరసింహ! దురిత దూర!
*
భావం: ఓ స్వామీ నీవు లోకపాలకుడవు. గోపాలకుడవు. కోటి సూర్యులతో సమానుడవు. గరుడ వాహనుడవు. భక్తుల పాలిటి పారిజాత వృక్షానివి. బ్రహ్మరుద్రేంద్రాదులచే ప్రస్తుతింపబడువాడవు. సామగాన ప్రియుడవు. పద్మలోచనుడవు. సముద్రము వలె గంభీరుడవు. శ్రీవత్సవక్షుడవు. కౌస్త్భు వక్షుడవు. శంఖం, చక్రం, గద, కత్తి, ధనుస్సు , చేతుల ధరించిన వాడవు. దీనరక్షకుడవు. వాసుదేవుడవు. రాక్షసాంతకుడవు. నారదునిచే కొనియాడదగిన వాడవు. పన్నగశయనుడవు.చెవుల నవరత్న కుండలాలు తాల్చిన వాడవు. నీ పాద పద్మాలకు పండితులెప్పుడూ నమస్కారం చేస్తారు. నీవు దురిత దూరుడవు. నీకివే మా నమస్కారం.