నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. నాగేంద్ర శయన నీ నామ మాధుర్యంబు
మూడు కన్నుల సాంబమూర్తి కెరుక
పంకజాతాక్ష ! నీ బలపరాక్రమ మెల్ల
భారతీ పతియైన బ్రహ్మ కెరుక
మదుకైటభారి ! నీ మాయ సమర్థత
వసుధలో రబలి చక్రవర్తి కెరుక
పరమాత్మ !నీ దగు పక్షపాతిత్వంబు
దశశతాక్షుల పురందరున కెరుక

తే. వీరికెరుకగు నీకథల్ వింతలెల్ల
నరుల కెరుకన్న నెవరైన నవ్విపోరె?
భూషణ వికాస ! శ్రీధర్మ పుర నివాస!
దుష్టసంహార ! నరసింహ! దురిత దూర!

భావం: ఓ నాగరాజశయనా! నీ నామరుచి సాంబశివునకు తెలుసు. పద్మాక్షా! నీ బలపరాక్రమాలు బలి చక్రవర్తికి తెలుసు. వాణీధవుడగు బ్రహ్మకు తెలసు. మధుకైటభ రాక్షసుల చంపిన నీ మాయాశక్తి బలి చక్రవర్తికి తెలుసు. నీ పక్ష పాత వైఖరి సహస్రాక్షుడైన ఇంద్రునికి తెలుసు. వీరికి తెలిసిన నీ కథలలోని మర్మాలు సామాన్య మానవులకు తెలుసును అని పలికితే ఎవ్వరైనా నవ్వరా తండ్రీ!