నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. నిగమ గోచర! నేను నీకు మెప్పగునట్లు
లెస్సగా బూజింపలేను సుమ్మి
నాకు దోచిన భూషణములు పెట్టెదమన్న
గౌస్త్భుమణి నీకు గలదు ముందె
భక్ష్య భోజ్యముల నర్పణము జేసెదనన్న
నీవు పెట్టితే సుధ నిర్జరులకు
గలిమి కొలదిగ గానుకల నొసంగెదమన్న
భార్గవీ దేవి నీ భార్య యయ్యె
తే. అన్ని గలవాఁడ నఖిల లోకాధిపతివి
నీకు సొమ్ములు పెట్ట నేనెంత వాడ
భూషణ వికాస ! శ్రీధర్మ పుర నివాస
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!
భావం: ఓ నరసింహప్రభూ! వేదవేద్యా !నీకు ప్రీతి గల్గునట్లు నేను నిన్ను పూజించజాలను. హారాలు, తొడుగుతామనుకొంటే కౌస్త్భుమణి నీకు ముందే ఉంది. తినుబండారాలు సమర్పిద్దామనుకుంటేఅసలు దేవతలకే అమృతం త్రాగనిచ్చిన వాడివి. పోనీ సిరులైనా సమకూరుద్దామంటే నీ భార్య లక్ష్మీదేవి. లోకాలన్నింటికీ నీవే ప్రభువువి. నీ వద్ద అన్నీ ఉండనే ఉన్నాయి. ఇక నీకు నేను పెట్టే సొమ్ములు ఏమిటి? నీకు సొమ్ములు పెట్టడానికి నేనెంతటివాడని.