నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. దనుజ సంసార! చక్రధర ! నీకు దండంబు
ఇందిరాధిప నీకు వందనములు
పతిత పావన; నీకు బహు నమస్కారముల్
నీరజదళాక్ష! నీకు శరణు
వాసనార్చిత ! మేఘ వర్ణ! నీకు శుభంబు
మందర ధర! నీకు మంగళంబు
కంబుకంధర ! శార్‌ఙ్గకర ! నీకు భద్రంబు
దీనరక్షక! నీకు దిగ్విజయము
తే. సకల వైభవములునీకు సార్వభౌమ!
నిత్య కళ్యాణములు నగు నీకు నెపుడు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార ! నరసింహ! దురిత దూర!
భావం: ఓ నరసింహస్వామీ రక్కసుల్ని చంపిన నీకు నమస్కారం. లక్ష్మీమనాథా నీకు వందనం. పాపుల్ని రక్షించు ప్రభూ! నీకు నమస్కృతులు. పద్మ దళాక్ష!నీకు శరణు. ఇంద్ర పూజిత మేఘ వర్ణ నీకు శుభం. మందరగిరిధారీ నీకుమంగళమగుగాక. శంఖం వంటి గొంతు గల స్వామీ దనుర్దారీ నీకు భద్రమగు గాక. దీనజన రక్షకా నీకు విజయమగు కాక. మహారాజా! నీకెల్లప్పుడూ కళ్యాణ మగు కాక సకల సంపదలుకలుగుగాక!