నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే. ‘సకల ధర్మవిదుండవు సర్వలోక
వర్తనము లెఱింగిన పుణ్యకర్త, నీవు
నెయ్యమొనరంగ నెఱిఁగింపుమయ్య మాకు
వెలయఁ బుణ్యలోకంబులు గలవె’ యనిన
భావం: ఎన్నో యేండ్లు ధర్మమార్గంలో చరించి తాను రాజ్యాన్ని యేలి తన రాజ్యం సుభిక్షంగా ఉండేలాగు ధర్మకార్యాలను ఆచరించి దేవయానిని పెండ్లాడి మరల శర్మిష్ఠను కూడా పెండ్లాడి శుక్రుని చేత శపించబడి, తాను చేసిన పనిని శుక్రాచార్యునికి వివరించి ఆయన కోపాన్ని తగ్గించి శాపవిమోచనాన్ని పొంది తరువాత శర్మిష్ఠకుమారుడైన పూరురవుని వనాన్ని తాన తీసుకొని కొన్నాళ్లు రాజ్యభోగాలను అనుభవించి తిరిగి తనముదిమిని తీసుకొని పూరూరవుని ఆయన వనాన్ని తిరిగి ఇచ్చివేసి తరవాత తపస్సు చేసి దైవాన్ని మెప్పించి స్వర్గ,సత్యలోకాలను పర్యటించి అహంకార శేషం వల్ల నక్షత్రలోకానికి వెళ్లిన యయాతి తన మనుమలకు మంచిచెడుల జ్ఞానాన్ని బోధిస్తున్న యయాతితో ‘నీవు ధర్మాలను ఎరిగినవాడివి, సర్వలోక ప్రవర్తనలు తెలిసిన పుణ్యమూర్తివి, స్నేహమొప్పగా మాకు పుణ్యలోకాలు కలవా?’ అని అష్టకాదులు అంటే యయాతి మనుమలు యయాతిని అడిగారు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము