నేర్చుకుందాం

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే,గీ. శ్రీని వక్షమున ధరించు శ్రీకరుడగు
నల్లనయ్యకు ననుగు మేనల్లుడైన
వాడు, భయహరుండును విఘ్న వారకుండు
శ్రీగణేశుండు మనలకు సేమమొసగు

భావం: నారాయణుని చెల్లెలు నారాయణి. అనగా పార్వతీదేవి. ఆ పార్వతీ దేవి కుమారుడైన గజాననుడు శ్రీమహావిష్ణువుకు మేనల్లుడు కదా. మహావిష్ణువుకు మేనల్లుడైన విఘ్ననివారకుడైన విఘ్నేశుడు శ్రీగణేశుడు మనలకు క్షేమము గూర్చుగాక!

తే.గీ. బవ్య రాధాధరామృత పానశీల!
రంజిత రసరమ్య మురళీ రవ విలోల!
నవ్య నవనీతనిభ కరుణాల వాల!
సుందరోజ్వల రుచి జాల ! వందనములు!

భావం: రాధాధర సుధారస పానమునందు ఆసక్తి కలవాడా! దివ్య మురళీగాన లోలా! అపుడే తీయబడిన వెన్నవంటి కరుణకు ఆలవాలమైన వాడా! సుందరమైన దేహకాంతి గలవాడా ! ఓ మురళీధరా! నీకు వందనాలు!

(సేకరణ) డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949