నేర్చుకుందాం

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. బృందావన విహారు వందారు మందారు
నిరుపమాలంకారు నిగమ సారు
భాసిత దరహాసు వైకుంఠని జవాసు
సురచిర లోకేశు సుప్రకాశు
మురళీ రవవిలోలు ముగ్ధ మోహన బాలు
స్వర్ణ వర్ణిత చేలు స్వజన పాలు
చాణూర మర్దను సంతోష వర్థను
దేవకీ నందను దీనశరణు

ఆ.వె. అగణిత గుణ సాంద్రు యదుకులోదధి చంద్రు
సదమల శుభగాత్రు సచ్ఛరిత్రు
చిరయశోవిరాజు శ్రీసూర్య సమతేజు
మధుర మంజుభాషు మదిని దలతు !
భావం: బృందావనమున విహరించువాడు, నమస్కరించువారికి కల్పవృయమైన వాడు, విశేషమైన అలంకారంతో వేదసారంగా భాసించేవాడు, ప్రకాశించే చిరునవ్వు గలవాడు, మోహనుడై మురళీ రవంబున మునిగి యుండెడు వాడు, పీతాంబరధరుడు, భక్తజన పరిపాలకుడూ, చాణూరుడనే రాక్షసుని సంహరించిన వాడు, సంతోషమును ప్రవర్థమానము సేయువాడు, దీన జన శరణ్యుడూ, దేవకీ నందనుడూ, యదుకులాంబుధికి చంద్రుడై శుభ గుణములకు ఆలవాలమైన వాడు, నిర్మలమైన దేహము గల్గిన సచ్ఛరిత్రుడూ , చిరకీర్తి గల్గి సూర్య సమానమైన తేజస్వి యైన వాడు, మధుర మంజుల భాషణుడు ఐన శ్రీకృష్ణుని మదిలో స్మరించి నమస్కరింతును.

(సేకరణ) డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949