నేర్చుకుందాం

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. నన్ను ముద్దుల తోడ కన్నయ్య యని పిల్చి
వెన్న ముద్దలుబెట్టు ప్రేమ మూర్తి
జారిన పింఛమ్ము సరిజేసి, తిలకమున్
సరిజూచి పంపించు స్వాదుమూర్తి
చెడ్డగానెవరెన్ని చెప్పినన్ నమ్మక
నన్ను నమ్మినయట్టి కన్నతల్లి
కొండెముల్ జెప్పిన గోపకాంతల జూచి
పరిహాస మాడిన పసిడి తల్లి

ఆ.వె. నన్ను జూడలేని నా మాట వినలేని
నాదు భవ్య లీల నరయలేని
బాధచేత మాయశోదమ్మ అచట
ఎట్టులున్నదేమొ? ఎరుగనైతి!

భావం: ముద్దుగా నాకు వెన్నముద్దలు పెట్టేది, నాకు నెమలి ఫింఛం జారిపోతే సరిచేసేది. ఆ చేతనే నానుదుటన చెదరిన తిలకం దిద్ది పంపించేది, ఎవరు నా మీద ఎన్ని విధాలుగా చాడీలు చెప్పినా, వాటిని నమ్మకుండా ననే్న నమ్మినదీ, నా మీద చాడీలు చెప్పిన గోపకాంతలను పరిహసించినదీ, అయిన మా యశోదమ్మ వ్రేపల్లెలో ఇపుడు ఏం చేస్తోందో ఎలా ఉందో.. అని తలచుకుంటూ మధుర లో శ్రీకృష్ణుడు అమ్మను తలుచుకుంటున్నాడు.

(సేకరణ) డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949