నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

. వలయు నమాత్యులం దగిన వారల నుండఁగఁ బంచిధారుణి
తల విభుఁడొక్కరుండ చని తన్విఁ బయోజదళాయతాక్షి సం
కుల మిళ తాళినీల వరికుంచిత కోమలకుంతలన్ శకుం
తల యను కన్యకం గనియెఁ దన్ను నివల్లభు మందిరంబునన్

భావం: తన వెంట వస్తున్న ముఖ్యులైన మంత్రులను అనుచరులను ఇక్కడే ఉండేటట్లు నియమించి దుష్యంతుడు ఒంటరిగానే వెళ్లి మునిశ్రేష్ఠుడైన కణ్వుడి నివాసంలో సన్నని మేను కలిగినది. తామర పూల రేకుల వంటి విశాలమైన కన్నులు కలది ఒత్తుగా గుమికూడిన తుమ్మెదల వలె చల్లగా అల్లుకున్న మెత్తని ముంగురులు కలది, అయిన శకుంతల అనే కన్యను చూచాడు. దుష్యంతుడు వేటాడటంలో అలసిసొసలి కణ్వాశ్రమానికి వెళ్లాడు. అక్కడ కణ్వుడు పెంచుకుంటున్న కూతురిని చూచి మిక్కిలి ఆశ్చర్యంతో దుష్యంతుడు చూసాడు. ఆశకుంతల మిగుల సౌందర్యవతి.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము