నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. అమ్ముని యల్గి చూచుదును నా క్షణమాత్రన గో త్రధారుణీ
ధ్రమ్ములు ప్రయ్యు, నయ్యిసుము దక్కఁగ సంబుధు లింకు, మూఁడులో
కమ్ములు దిర్దిరం బరుగు, గాడ్పు చలింపఁగ నోదు, సుగ్రతం
బమ్మిన యట్టి కోప పరుపాలికి భామలు వోప నోడరే
భావం: దేవేంద్రుడు మేనక ను విశ్వామిత్రుని దగ్గరకు వెళ్లి తపోభంగం చేయమని సూచించాడు. అది విన్న మేనక భయపడింది. విశ్వామిత్రుడు ఎంతో తపశ్శాలి అని తనకు ఏదైనాశాపం ఇవ్వగల బలశాలి అని చెప్పుతూ ఆ విశ్వామిత్ర ముని కోపించి చూస్తే ఆ క్షణంలోనే కుల పర్వతాలన్నీ బ్రద్ధలౌతాయి. అడుగున ఉన్న ఇసుక మాత్రమే మిగలేటట్లు సముద్రాలన్నీ ఇంకిపోతాయి. మూడులోకాలూ గిర గిరా చక్రం వలె తిరగి పోతాయి గాలి కదలటానికి జంకుతుంది ఉగ్రస్వభావంతో అతిశయించే ఆకోప పరుడి సమీపానికి భామలు పోవడానికి భయపడరా? అని అసలే కోపగ్రస్తుడైన విశ్వామిత్రుడు తన్ను చూచి తపోభంగం చేయడానికి వచ్చానని తెలుసుకొంటే ఏవౌతుంది? కోపంలో ఏ శాపాన్నైనా ఆ విశ్వామిత్రుడు ఇచ్చేస్తాడని దేవేంద్రునితో తన మనసులోని శంకను మేనక చెప్పింది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము