నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ. సకలోర్వీశుఁ డతి ప్రయత్నపరుఁడై సర్వ క్రియా దక్ష త
క్షకకోటుల్ పని సేయఁగా ఘనతరైక స్తంభ హర్త్యంబుఁ ద
క్షకభీతిన్ రచియింప ఁ బంచి, దృఢరక్షన్ దానిలో నుండెఁ మఆ
యక రాత్రిందివజాగరూక హిత భృత్యామాత్యవర్గంబుతోన్
భావం: శమీకుడను ముని పంపగా వచ్చి గౌరముఖుడను ముని వలన తాను చేసిన పనికి తగిలిన శాప వృత్తాంతాన్ని తెలుసుకొన్నాడు పరీక్షిత్తు. ఆ తరువాత తానుచేసిన పనికి పశ్చాత్తాప పడ్డాడు. శృంగి ఎంత గట్టి శాపాన్ని తనకు విధించాడో తెలుసుకొని చింతించాడు. కాని శమీకునికి తానుచేసిన పనికి ఓర్చుకొని కూడా తన కుమారుడు చేసిన ప్రతిజ్ఞనుంచి బయట పడమని చెబుతూ తన క్షేమాన్ని కాంక్షించే ముని వైఖరి నిచూచి పరీక్షిత్తు ఎంతో మెచ్చుకుంటూ తాను చేయవలసిన పనిని గూర్చి ఆలోచించాడు. సర్వభూమికి ప్రభువైన పరీక్షిత్తు అధికమైన ప్రయత్నంలో ఆసక్తి కలవాడై తక్షకుడి వలన భయం చేత అన్ని పనులు చేయడంలో నేర్పరులైన వడ్రంగులసమూహాలు పనిచేయగా గొప్పదైన ఒంటి కంబపు మేడ నిర్మంచడానికి ఆజ్ఞాపించి రాత్రింబవళ్లు మేల్కొని ఉండి శ్రద్ధ వహించే ఆప్తుల, సేవకుల, మంత్రుల సమూహంతో విడువక దట్టమైన రక్షణతో ఆ ఒంటి స్తంభపు మేడలో నివసించాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము