నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. ‘బ్రాహ్మంబు దైవంబుఁ బరఁగ నార్షంబు ఁ బ్రా జాపత్యమును రాక్షసంబు నాసు
రంబు గాంధర్వంబు రమణఁ బైశాచంబు నను నెనిమిది వివాహములంయందు
గడుఁబ్రశస్తములు సత్ క్షత్త్ర వంశ్యులకు గాంధర్వ రాక్షసములు ధర్మయుక్తి
నీకును నాకును నెమ్మిఁ బరస్పర ప్రేమంబు గా ముండు పెంపఁదొడఁగెఁ
ఆ. గాన యెడయుఁ జేయఁగా నేల? గాంధర్వ
విధి వివాహ మగుట వినవె యుక్త’
మనిన లజ్జఁ జేసి యవనత వదనయై
యాలతాంగి యిట్టు లనియెఁ బతికి
భావం: బ్రాహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, రాక్షసం, అసురం, గాంధర్వం, పైశాచం అనే ఎనిమిది రకాలైన వివాహాలలో ఉత్తమ క్షత్రియ వంశాలకు చెందినవారికి గాంధర్వ రాక్షస వివాహాలు ధర్మంతో కూడి ఉండటం చేత మేలైనవి. ఇప్పుడు మన్మథుడు నీకూ నాకూ ప్రేమను ప్రీతితో పరస్పరం పెంపొందింపచేస్తున్నాడు. కాబట్టి ఆలస్యం చేయటమెందుకు? గాంధర్వ వివాహ పద్ధతిలో పెండ్లాడటం సమంజసం సుమా! అని దుష్యంతుడు పలుకగా ఆ శకుంతల సిగ్గుతో తల వంచుకుని రాజు తో మాట్లాడాలని అనుకొంది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము