నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ. విపరీత ప్రతిభాష లేమిటికి నుర్వీనాథ! రుూ పుత్త్రగా
త్ర పరిష్వంగ సుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూర సాం
ద్రవరాగ ప్రసరంబుఁ జందనముఁ జంద్రజ్యోత్న్స యుం బుత్త్రగా
త్ర పరిష్వంగమునట్లు జీవులకు హృద్యంబే కడున్ శీతమే

భావం: ఓ రాజా! విరుద్దాలైన మారు మాటలు ఎందుకు? ఈపుత్రుడిని కౌగిలించుకొని ఈతడి కౌగిలి వలన కలిగేసుఖాన్ని అనుభవించుము. ముత్యాల హారాలు , పచ్చకర్పూరపు దట్టమైన పొడి ప్రసారం , మంచిగంధమూ వెనె్నల యూ జీవులకూ పుత్రుని కౌగిలి వలె మనసుకు సుఖాన్నీ మంచి చల్లదనాన్ని కలిగించలేవు. పుత్రుని పరిష్వంగము భౌతికమైన ఆనందాన్నిచ్చే ఏవస్తువుకూ సాటిరాదని శకుంతల దుష్యంతునితో చెబుతుంది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము